కేంద్ర ప్రభుత్వంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల బంద్‌తో పంజాబ్ జనజీవనం స్తంభించింది. 163 రైళ్లు రద్దు కాగా, రాకపోకలు నిలిచిపోయాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టబద్ధ హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రైతుల డిమాండ్ల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ రైతు సంఘాలు సోమవారం పంజాబ్ బంద్ నిర్వహించాయి.