జుట్టు రాలడానికి చాలానే కారణాలు ఉంటాయి. జన్యుకారణాలు, ఆరోగ్య సమస్యలు, సరైన ప్రోడక్ట్స్ వాడకపోవడం, హార్మోనల్ చేంజెస్, కొన్ని మెడిసిన్స్ తీసుకోవడం వంటి కారణాల వల్ల జుట్టు రాలుతుంటుంది.
ఈ జుట్టు రాలే సమస్యని కంట్రోల్ చేయడానికి ఎన్నో సొల్యూషన్స్ ఉంటాయి. అయితే, నేచురల్‌గా దీనిని కంట్రోల్ చేయాలి. జుట్టుకి ప్రోటీన్ చాలా మంచిది. ప్రోటీన్ ఎక్కువగా ఉండే గుడ్లని వాడితే జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేయొచ్చు. ఇందులో విటమిన్స్, ప్రోటీన్స్, మినరల్స్, ఉంటాయి. గుడ్లని తినడం వల్ల హెయిర్ ఫోలికల్స్ బలంగా మారతాయి. అంతేకాకుండా, గుడ్డుతో హెయిర్ మాస్క్ వాడడం వల్ల కూడా జుట్టు పెరుగుదలకి హెల్ప్ అవుతుంది. గుడ్డులో ఎక్కువగా అమైనో యాసిడ్స్ ఉంటాయి. వీటితో పాటు మినరల్స్, విటమిన్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ జుట్టుని కుదుళ్ల నుంచి బలంగా, మృదువుగా చేస్తాయి. గుడ్డులో ముఖ్యంగా బయోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి.. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి కొత్త జుట్టు పెరిగేలా చేస్తాయి. దీంతో జుట్టు పెరుగుతుంది. రాలడం తగ్గుతుంది. తెగిపోవడం తగ్గుతుంది. కండీషనింగ్ అవుతుంది. సెబమ్ బ్యాలెన్స్ అవుతుంది.
పెరుగుతో..
ముందుగా గుడ్డు సొనని ఓ బౌల్లో వేసి బాగా బీట్ చేయండి. ఇందులోనే 3 నుంచి 4 చెంచాల పెరుగు వేయండి. దీనికి 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి కలపండి. నిమ్మలోని గుణాలు క్లెన్సింగ్‌లా పనిచేస్తాయి. దీనిని స్కాల్ప్, జుట్టుకి అప్లై చేయండి. ఆరిన తర్వాత క్లీన్ చేయండి. దీంతో జుట్టు సిల్కీగా అందంగా పెరుగుతుంది.
ఆముదంతో..
ఆముదం జుట్టుని పెంచడంలో కీ రోల్ పోషిస్తుంది. దీంతో గుడ్డు కలిస్తే మరింత బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. దీనికోసం ఓ రెండు గుడ్లని పగులగొట్టి బౌల్లో వేయండి. దీనికి ఓ టేబల్ స్పూన్ ఆముదం వేసి కలపండి. దీనిని జుట్టు కుదుళ్లకి, జుట్టుకి బాగా రాయండి. దీనిని 30 నిమిషాల పాటు అలానే ఉంచి షాంపూ చేయండి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది కూడా.
పట్టులాంటి జుట్టుకోసం అరటిపండు..
కొబ్బరి నూనెతో..
ముందుగా ఓ బౌల్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ల కొబ్బరినూనె, 4 టేబుల్ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ తీసుకోండి. ఇందులో ఎగ్ వైట్ మాత్రమే వేసి బాగా కలపండి. తర్వాత ఈ మాస్క్‌ని జుట్టుకి, కుదుళ్ళకి బాగా పట్టించండి. తర్వాత షాంపూతో క్లీన్ చేసుకోండి. కండీషనర్ వాడితే చాలా మంచిది. రెగ్యులర్‌గా వాడితే డ్రై హెయిర్ ప్రాబ్లమ్ తగ్గి జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది.
అరటిపండుతో..
ఈ మాస్క్ కోసం ముందుగా ఓ గుడ్డుని పగలగొట్టి బౌల్లో వేయండి. ఇందులోనే అరటిపండుని గుజ్జులా వేసి వేయండి. 3 టేబుల్ స్పూన్ల పాలు వేయండి, అదే విధంగా, 3 టేబుల్ స్పూన్ల తేనె వేయండి, 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేయండి.
అయితే, మీ జుట్టు పొడవుని బట్టి పదార్థాల పరిమాణం పెంచడం, తగ్గించడం చేయొచ్చు. దీనిని బాగా కలపండి. దీనిని స్కాల్ప్, జుట్టుకి అప్లై చేయండి. అరగంట తర్వాత షాంపూ చేయండి. దీనిని వారానికి రెండు, మూడు సార్లు వేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
అలోవెరా..
గుడ్డుసొన జుట్టుకి మంచి హెయిర్ మాస్క్. దీనికోసం.. ఆలివ్ ఆయిల్లో అలోవెరా జెల్, గుడ్డు సొనని వేసి బాగా కలపాలి. కావాలనుకుంటే జొజొబా ఆయిల్ కూడా వేసుకోవచ్చు. వీటన్నింటిని బాగా మిమ్స్ చేయాలి. దీనిని జుట్టు కుదుళ్ళకి బాగా పట్టించి 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. రెగ్యులర్‌గా ఈ ప్యాక్ వేస్తే జుట్టు రాలడం తగ్గి పొడుగ్గా పెరుగుతుంది.