ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 రూపాయల స్టాక్ అద్భుతం.. ఒక్కరోజే ఆ ఒక్క కారణంతో 20 శాతం దూసుకెళ్లిన షేరు

business |  Suryaa Desk  | Published : Wed, Jan 01, 2025, 11:11 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు 2025 జనవరి 1న మంచి లాభాలు నమోదు చేశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 368 పాయింట్లు పెరిగి 78507.41 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 98 పాయింట్లు పుంజుకొని 23742.90 వద్ద సెషన్ ముగించింది. ఈ క్రమంలోనే ప్రముఖ రియాల్టీ స్టాక్ ప్రోజోన్ రియాల్టీ లిమిటెడ్ ఇన్వెస్టర్లకు కాసుల పంట పండించింది. ఒక్క సెషన్లోనే 20 శాతం దూసుకెళ్లింది. ముందటి సెషన్లో అంటే 2024, డిసెంబర్ 31న రూ. 27.71 వద్ద ముగియగా ఇవాళ మంచి లాభాలతోనే రూ. 29.85 వద్ద ఓపెన్ అయింది. తర్వాత కాసేపటికే 20 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టింది. చివరకు 19.99 శాతం లాభంతో రూ. 33.25 వద్ద సెషన్ ముగించింది.


ఇక కంపెనీ మార్కెట్ విలువ ఈ క్రమంలోనే రూ. 507.40 కోట్లకు చేరింది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట ధర రూ. 44.80 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 20.91 గా ఉంది. కంపెనీ ఇప్పుడు చేసిన ఒక్క ప్రకటనతోనే భారీగా దూసుకెళ్లింది. దాదాపు 3.96 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ ఆఫర్‌లో కొనుగోలు చేసేందుకు ప్రకటించింది. కంపెనీ మొత్తం ఈక్విటీలో ఇది 26 శాతం వాటాకు సమానం. ఇక్కడ ఒక్కో షేరు ధరను రూ. 25 గా ప్రకటించింది. ఇక ఇందులో భాగంగా మొత్తం రూ. 99.19 కోట్లు వస్తాయని తెలుస్తోంది.


అయితే ఈ స్టాక్ ఇప్పటికీ 52 వారాల గరిష్ట ధర అయిన రూ. 44.90 కి 26 శాతం దూరంలోనే ఉంది. 2024 ఫిబ్రవరిలో ఇలా ఆల్ టైమ్ హైని తాకిందని చెప్పొచ్చు. ఇక గత 5 రోజుల్లో ఈ షేరు 32 శాతం పుంజుకుంది. నెల రోజుల్లో 37 శాతం పుంజుకుంది. 6 నెలల్లో చూస్తే 10 శాతానికిపైగా పెరిగింది. ఏడాదిలో చూస్తే ఒక శాతానికిపైగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ. 1.33 కోట్ల నికర నష్టం ప్రకటించింది. ఇక ఇదే అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 1.39 కోట్ల లాభం ఉండేది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com