డీమార్ట్ (Dmart) పేరిట దేశవ్యాప్తంగా రిటైల్ వ్యాపారం నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్‌మార్ట్స్ షేర్లు నేడు రాణించాయి. బీఎస్ఈలో ఒక్కో షేరు 15 శాతం పెరిగి రూ.4,160 దగ్గర అప్పర్ సర్క్యూట్‌ను తాకింది.
మూడో త్రైమాసికానికి సంబంధించి తమ కంపెనీ వృద్ధి వివరాలతో డీమార్ట్ గురువారం మార్కెట్ ముగిసిన తర్వాత నివేదిక విడుదల చేసింది. ఈనేపథ్యంలో స్టాక్‌లో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీంతో షేర్లు దూసుకెళ్లాయి.