మీరు పర్సనల్ లోన్ తీసుకోవాలని చూస్తున్నారా? అయితే మీకు జీతం తక్కువగా ఉందని ఆలోచిస్తున్నారా. అయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఇప్పటికీ పర్సనల్ లోన్ కోసం అప్లై చేసుకోవచ్చు. చాలా బ్యాంకులు ఇప్పటికీ తక్కువ జీతం ఉన్నప్పటికీ లోన్లు మంజూరు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొన్ని షరతులు వర్తిస్తాయి. అందుకే.. తక్కువ జీతం ఉన్న వారు బ్యాంకుల్లో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటే.. మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. ముందుగా లోన్ ఎందుకోసమో ఆలోచించుకోవాలి. ఏదైనా కార్యక్రమం నిర్వహించేందుకా? ఇంటి పునరుద్ధరణ కోసమా? వెకేషన్ వెళ్లేందుకా? ప్రియమైన వారికి ఏదైనా గిఫ్ట్ కొనుగోలు చేసేందుకా? అని ముందుగా తెలుసుకోవాలి.
ఇంకా లోన్ కోసం అప్లై చేసుకునే ముందు మీ అర్హతల గురించి తెలుసుకోవాలి. కొన్ని బ్యాంకులు కనీస జీతం చూస్తుంటాయి. చాలా సార్లు ఇదే మీరు లోన్ పొందకుండా ఆపే అవకాశాలు ఉంటాయి. అందుకే తక్కువ జీతం ఉండి.. వ్యక్తిగత రుణాల కోసం ప్రయత్నిస్తుంటే.. ఏమేం విషయాల్ని పరిగణనలోకి తీసుకోవాలో చూద్దాం.
లోన్ అమౌంట్- చిన్న మొత్తం లోన్ తీసుకోవడం ద్వారా.. చిన్న మొత్తాల్లో ఇన్‌స్టాల్‌మెంట్ల ద్వారా తిరిగి చెల్లించేందుకు సాధ్యపడుతుంది. మీ జీతం తక్కువగా ఉంటే.. అప్పుడు తక్కువ మొత్తంలో లోన్ పొందేందుకు మీరు అర్హులుగా ఉంటారని చెప్పొచ్చు. ఒకవేళ లోన్ రీపేమెంట్ కోసం ఎక్కువ కాలవ్యవధి తీసుకున్నట్లయితే అప్పుడు నెలవారీగా ఈఎంఐ నగదును తగ్గించుకోవచ్చు.
కో అప్లికెంట్- మీ జీతం తక్కువ ఉన్న సమయంలో, లోన్ కోసం చూస్తుంటే ఇక్కడ గ్యారెంటర్ లేదా కో- అప్లికెంట్‌ను రికమెండ్ చేయొచ్చు. వీరికి ఇక్కడ మంచి సిబిల్ స్కోరు సహా స్థిరంగా ఎక్కువ ఆదాయం ఉంటే లోన్ పొందే ఛాన్స్‌లు పెరుగుతాయి.
ఎక్కువ సిబిల్ స్కోరు- మీ సిబిల్ స్కోరు 700 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు తక్కువ వడ్డీ రేటుకే లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది.
ప్రముఖ కంపెనీ- ఒకవేళ మీరు ప్రముఖ కంపెనీలో పనిచేస్తూ.. తక్కువ జీతం పొందుతున్నా లోన్ పొందేందుకు ఇది పెద్ద అడ్డంకిగా ఉండకపోవచ్చు. డెట్ టు ఇన్‌కం రేషియో- మీరు ఇప్పటికే వేర్వేరు రుణాలు తీసుకొని ఉంటే అప్పుడు పర్సనల్ లోన్ పొందడం కాస్త కష్టమే. ఇక్కడ డెట్- టు- ఇన్‌కం నిష్పత్తి కీలకంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు మీ జీతం రూ. లక్షగా ఉంటే లోన్ ఈఎంఐ రూ. 40 వేల కంటే తక్కువగా ఉండాలి. ఇదే రూ. 40 వేల జీతం ఉన్నట్లయితే.. ఈఎంఐ రూ. 16 వేల కంటే తక్కువ ఉండాలన్నమాట.