తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి వెనక్కి తగ్గారు. బీజేపీ నేత, నటి మాధవీలతకు సారీ చెప్పారు. మాధవీలతను గురించి ఆవేశంలో అలా అనేశానని.. అలా మాట్లాడటం తప్పేనంటూ క్షమాపణలు చెప్పారు. ఆమెకు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు జేసీ తెలిపారు. డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్కులో న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలపై బీజేపీ నేతలు మాధవీలత, సాదినేని యామిని విమర్శలు, ఆరోపణలు చేయడం.. వీటిని తిప్పికొట్టే క్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. జేసీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని.. మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి సారీ చెప్పారు. అయితే తన గురించి మాట్లాడిన రాజకీయ నాయకులంతా ఫ్లెక్సీ గాళ్లేనంటూ జేసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. మాధవీలత గురించి జేసీ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు రియాక్టయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే వారంతా ఫ్లెక్సీ గాళ్లంటూ జేసీ కీలక వ్యాఖ్యలు చేశారు.