AP: పట్టపగలే చోరీకి పాల్పడ్డ ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం జీవీఎంసీ 63వ వార్డు ఆదర్శ రాయల్ విద్యాలయ పాఠశాల పరిసర ప్రాంగణంలోని మూడో ఫ్లోర్‌లో ఉన్న రూమ్‌కిరూమ్‌కు ఉన్న తాళాన్ని పగలగొట్టి రూ. రెండు లక్షలు, మూడు తులాల వెండిని గుర్తుతెలియని దుండగుడు చోరీ చేశాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని చూసి అరవడంతో.. మూడో ఫ్లోర్ నుంచి దొంగ కిందకు దూకేసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.