నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. ‘‘ గతంలో ప్రధాని మోదీ ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు.
అందుకే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు విశాఖ వేదికగా ప్రధానితో ప్రత్యేక హోదా ప్రకటన చేయించండి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని మోదీతో పలికించండి’’ అని ట్వీట్లో పేర్కొన్నారు.