వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వ తప్పిదమే కారణమని దేవాదాయ శాఖ మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో జరిగిన భక్తుల మధ్య తోపులాటలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలుగా గుర్తించారు. 25 మందికిపైగా భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై వెల్లంపల్లి స్పందించారు.