తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.25 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు.
నిన్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కౌంటర్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందారు. ఈ క్రమంలో తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రులు అనగాని సత్యప్రసాద్, అనిత, ఆనం, పార్థసారథి పరామర్శించారు.