నగరి మండలం నెత్తం కండ్రిగ ప్రాథమికోన్నత పాఠశాలలో గురువారం ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో భోగి మంటలు వేసి గొబ్బెమ్మ పాటలు పాడారు. అలాగే గోమాత పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు పద్మజ జయశంకర్, ఉపాధ్యాయులు బాబు, సుమతి, అనిత, విఎల్ బాబు, రామరాజు తదితరులు ఉన్నారు.