AP: తిరుపతి తొక్కిసలాట ఘటనపై మాజీమంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరావు స్పందించారు. "ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందడం కలిచివేసింది. ఈ ఘటనకు చంద్రబాబే బాధ్యత వహించాలి. విజనరీ అని చెప్పుకొనే చంద్రబాబు నీ విజనరీ ఇదేనా?.. తిరుపతి చరిత్రలో ఇలాంటి బాధాకరమైన విషయం ఎప్పుడూ జరగలేదు. ప్లానింగ్,పద్దతి లేదు అధికారులను పోలీస్‌లను కలుపుకొని నిర్వర్తించాల్సిన కార్యక్రమంలో ఇంత నిర్లక్ష్యమా?" అని కారుమూరి మండిపడ్డారు.