దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ సతీమణి కిమ్ కియోన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. మాస్టర్ థీసిస్‌ను దొలిగించి యూనివర్సిటీకి సమర్పించారంటూ ఆమెపై అభియోగాలు వచ్చాయి.
2022నుంచి సూక్‌మ్యూంగ్ మహిళా యూనివర్సిటీ దీనిపై విచారణ చేస్తుంది. అయిన సరే కిమ్ తప్పుడు నివేదిక సమర్పించారు. దీనిపై ఈ నెలాఖరులోగా ఆమె స్పందించకపోతే తాము కనుగొన్న అంశాలను తుది ఫలితాలుగా ప్రకటిస్తామని యూనివర్సిటీ పేర్కొంది.