శ్రీవేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనంకోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని టీటీడీ మాజీ చైర్మన్, వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం, గాయాలపాలు కావడం విచారకరమన్నారు. చిత్తశుద్ధిలేని వ్యక్తులకు, వివాదాస్పద వ్యక్తులకు టీటీడీ పగ్గాలు ఇవ్వడం వల్లే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. టీటీడీని రాజకీయ కేంద్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై భూమన స్పందించారు.