తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఘటనపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు స్పందించారు. భక్తుల గేట్లను ఒక్కసారిగా తెరవడంతో 2 వేలమంది ప్రజలు ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో అదుపుతప్పి ఒకరిపై మరొకరు పడిపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుందన్నారు. అలాగే మొత్తం ఆరుగురు మృతుల్లో కేరళరాష్ట్రానికి చెందిన ఒక మహిళ ఉన్నారని, మిగిలిన ఐదుగురు వైజాగ్, నర్సీపట్నంకు చెందిన వారిగా గుర్తించామన్నారు.