టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇతర దేశాల రాజకీయాల్లో జోక్యం చేసుకోవడంపై ఇటీవల విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ఆయన తండ్రి ఎర్రల్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రజలకు ఎలాన్ చెప్పేది వినాల్సిన అవసరం లేదు.
నా ఉద్దేశంలో అతడో మామూలు మనిషి. అతని దగ్గర డబ్బుంది.బిలియనీర్ కాబట్టి అతను చెప్పిన విషయాన్ని అనేకమంది రీట్వీట్ చేస్తుంటారు. ఎలాన్ చెప్పేవన్నీ పట్టించుకోవద్దు’’అని పేర్కొన్నారు.