తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు కంపార్టుమెంట్ల నుంచి కాకుండా నేరుగా దర్శనానికి పంపిస్తున్నారు.నిన్న (మంగళవారం) 62,566 మంది స్వామివారిని దర్శించుకోగా 16,021 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ. 3.20 కోట్లు సమర్పించారు.
జనవరి 10 నుండి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10వ తేది నుండి 19వ తేది వరకు నిర్వహించనున్న పది రోజుల వైకుంఠద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్రీ జె.శ్యామలరావు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్ లో మంగళవారం ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైకుంఠ ఏకాదశి ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు.