అమెరికాలో రెండు భారతీయ కంపెనీలపై ఫెంటానిల్ రసాయనాలను దిగుమతి, పంపిణీ చేసినట్లుగా అభియోగాలు నమోదయ్యాయి. గుజరాత్‌కు చెందిన రక్యూటర్, అథోస్ కెమికల్ కంపెనీలు ఈ రసాయనాన్ని అమెరికా, మెక్సికోలకు సరఫరా చేస్తున్నాయని యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ అధికారికంగా తెలిపింది. అయితే భారతీయ కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి. ఈ అభియోగాలు నిజమైతే 53 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.