ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్‌పై ఆయన సోదరి చేసిన లైంగిక ఆరోపణలను ఖండిస్తూ శామ్, ఆయన తల్లి, సోదరులు కలిసి ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘‘ఆమె మానసికస్థితి సరిగా లేదు.
ఆమె గోప్యత దృష్ట్యా బహిరంగంగా స్పందించకూడదని అనుకున్నాం. కానీ, ఇప్పుడు ఆమె కోర్టుకు వెళ్లడం వల్ల ఈ ప్రకటనను విడుదల చేయాల్సి వచ్చింది’’ అని శామ్ కుటుంబం వెల్లడించింది.