నేడు జమిలి ఎన్నికల జాయింట్ పార్లమెంటరీ కమిటీసభ్యుల సమావేశం జరుగనుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుపై విస్తృత చర్చ కోసమే జేపీసీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మోడీ అసాధ్యం అనుకున్న బిల్లును సుసాధ్యం చేసి చూపారన్నారు. దేశంలో వరుసఎన్నికల వల్ల అభివృద్ధి కుంటుపడుతుందని తెలిపారు. ఆర్థికంగా భారంపడుతుందని తన అభిప్రాయం వ్యక్తం చేశారు.