అరటి సాగు ప్రారంభించిన రైతులు 9 నెలల్లో దిగుబడి పొందొచ్చు. అయితే అరటి సాగు చేసే రైతులు అంతర పంటలు వేస్తే మరిన్ని లాభాలు పొందొచ్చు. వీటిని పెంచడం కూడా చాలా సులభం. ముఖ్యంగా అరటి తోట ఎదుగుదలలో ఉండగా తొలి దశలో అంతర పంటలు వేస్తే మంచి ఫలితం ఉంటుంది. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, ముల్లంగి, మిరప, బెండ, పొట్లకాయ, బచ్చలికూర వంటి కూరగాయలతో పాటు బంతి-కనకాంబరం వంటి పూల సాగు కూడా చేయొచ్చు.