ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు అన్ని ఏర్పాట్లను పూర్తవుతున్నాయి. అయితే, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ ప్రెసిడెంట్ మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఈ కుంభమేళాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 34 ఎకరాల వక్ఫ్ భూముల్లో కుంభమేళా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. దీనికి అనుమతించడం ద్వారా ముస్లింలు పెద్ద మనసుని చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి ముస్లింలను కూడా అనుమతించడం ద్వారా హిందువులు ప్రతిస్పందించాలని కోరారు.