ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరగనుంది. కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండలం, డివిజన్ స్థాయిలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మండల డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని వారే జిల్లా కేంద్రానికి రావాలని ఆయన తెలిపారు.