హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల విశిష్టతను కాపాడడం, ముఖ్యంగా ఆలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించడం తదితర అంశాలే అజెండాగా నేడు విజయవాడ కేసరపల్లిలో హైందవ శంఖారావం సభ నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సభకు లక్షలాదిగా తరలివచ్చారు. చిన్నజీయర్ స్వామి, గణపతి సచ్చిదానంద స్వామి తదితర ఆధ్యాత్మికవేత్తలు ఈ సభకు హాజరై కీలక ప్రసంగాలు చేశారు. కాగా, ఈ హైందవ శంఖారావం సభలో వీహెచ్ పీ కీలక డిక్లరేషన్ ను ప్రకటించింది. చినజీయర్ స్వామి హైందవ శంఖారావం డిక్లరేషన్ ను అందరితో ప్రతిజ్ఞ చేయించారు.