హెచ్‌ఎంపీవీ కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో దేశీయ మార్కెట్ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1258.12 పాయింట్ల నష్టంతో 77,964.99 వద్ద ముగిసింది.
నిఫ్టీ సైతం 388.70 పాయింట్లు నష్టపోయి 23,616.05 వద్ద స్థిరపడింది. టైటాన్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ముగియగా.. టాటా స్టీల్, ఎన్టీపీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.