ప్రముఖ ఎడ్యుకేషన్ ప్రొవైడర్ వాంటేజ్ నాలెడ్జ్ అకాడమీ లిమిటెడ్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుపై రూ. 0.10 మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. ఈ మేరకు జనవరి 7న ఎక్స్చేంజీ ఫైలింగ్‌లో కంపెనీ వెల్లడించింది. కంపెనీ స్టాక్ ఫేస్ వాల్యూ (ముఖ విలువ) రూ. 1 గా ఉండగా.. ఇందులో 10 శాతాన్ని అంటే 10 పైసల్ని డివిడెండ్‌గా ప్రకటించింది. ఇలా ఎన్ని షేర్లు ఉంటే.. దాని చొప్పున డివిడెండ్ ఇన్వెస్టర్లకు చెల్లిస్తారు. ఈ మధ్యంతర డివిడెండ్ పొందాలంటే 2025, జనవరి 17ను కంపెనీ రికార్డు డేట్‌గా ప్రకటించింది. అంటే ఆ తేదీలోగా ఈ షేర్లు కలిగి ఉన్న వారికి డివిడెండ్ వస్తుంది. ఇక 30 రోజుల పీరియడ్‌లో డివిడెండ్ చెల్లిస్తారు. ప్రస్తుత ఫైలింగ్ డేటా ప్రకారం.. మధ్యంతర డివిడెండ్ రూపంలోనే రూ. 1.13 కోట్లు చెల్లించనున్నట్లు తెలిపింది.
మధ్యంతర డివిడెండ్‌కు తోడు.. ఈ కంపెనీ మరో ఆఫర్ ప్రకటించింది. అదే బోనస్ షేర్లు. 2:1 నిష్పత్తిలో ప్రస్తుతం బోనస్ షేర్లను ఇష్యూ చేసింది. అంటే ఇన్వెస్టర్ దగ్గర ఉన్న ప్రతి ఒక్క ఈక్విటీ షేరుపై అదనంగా రెండు షేర్లు వస్తాయి. అంటే ఒకవేళ ఇన్వెస్టర్ దగ్గర 100 షేర్లు ఉంటే.. అదనంగా 200 షేర్లు వస్తాయి. ఇక్కడ పెట్టుబడి అలాగే ఉంటుంది స్టాక్ ధర తగ్గుతుంది. షేర్ల సంఖ్య పెరుగుతుంది.
ఈ కంపెనీ విషయానికి వస్తే.. జనవరి 7న (మంగళవారం) 5 శాతం అప్పర్ సర్క్యూట్ కొట్టి రూ. 197.10 వద్ద సెషన్‌ను ముగించింది. గత 5 సెషన్లలో కూడా వరుస అప్పర్ సర్క్యూట్లు కొట్టింది. ఈ క్రమంలోనే 21 శాతానికిపైగా పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ విలువ రూ. 2.24 వేల కోట్లుగా ఉంది. ఇక స్టాక్ 52 వారాల గరిష్ట విలువ రూ. 270.70 కాగా.. కనిష్ట విలువ రూ. 10.80 గా ఉంది.
ఇంకా ఈ స్టాక్ 6 నెలలు, ఏడాది, రెండేళ్లు, ఐదేళ్లు ఇలా బంపర్ ప్రాఫిట్స్ అందించింది. 6 నెలల వ్యవధిలోనే 332 శాతం పుంజుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు అంటే 7 రోజుల్లో 21 శాతం పెరిగింది. ఏడాది వ్యవధిలో చూస్తే 1613 శాతం పెరిగింది. ఈ క్రమంలో లక్ష పెట్టుబడిని రూ. 17.13 లక్షలు చేసింది. ఐదేళ్ల వ్యవధిలో అయితే 14,608 శాతం రిటర్న్స్ ఇవ్వగా.. ఈ సమయంలో లక్ష పెట్టుబడిని రూ. 1.47 కోట్లు వచ్చాయి. 2024, డిసెంబర్ 17న 52 వారాల గరిష్ట స్థాయిని నమోదు చేసింది. 2024, జనవరి 10న రూ. 10.81 వద్ద కనిష్ట స్థాయిని తాకింది.