దేశీయ దిగ్గజ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ మరోసారి బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లాష్ సేల్ పేరుతో అతి తక్కువ ధరకే విమాన ప్రయాణం కల్పిస్తోంది. తరుచూ ప్రయాణాలు చేసే వారు, టూర్లు వెళ్లాలనుకునే వారు, ఒక్కసారైనా విమాన ప్రయాణం చేయాలని భావించే వారికి ఇదో గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం బస్ టికెట్ ధరకే విమానం ఎక్కవచ్చు. అంతేకాదు ఈ ఆఫర్ సమయంలో టికెట్లు బుకింగ్ చేసుకుని 2025, సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. మరి ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ ఈ స్పెషల్ సేల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ తీసుకొచ్చిన ఈ ఫ్లాష్ సేల్ ఇప్పటికే మొదలైపోయింది. ఇందులో టికెట్లు బుక్ చేసుకునేందుకు జనవరి 13, 2025 అర్ధ రాత్రి వరకు అవకాశం ఉంటుంది. టికెట్లు బుక్ చేసుకున్న వారు జనవరి 24, 2025 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ అధికారిక వెబ్‌సైట్ airinidaexpress.com, మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. టికెట్ బేస్ ఫేర్ పై మాత్రమే ఆఫర్ ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ ఛార్జీలు, ప్రభుత్వ ట్యాక్సులు వేరుగా ఉంటాయని గమనించాలి.
ఇక ఈ ఫ్లాష్ సేల్ రెండు విధాలుగా ఉంటుంది. మొదటిది ఎక్స్‌ప్రెస్ లైట్. ఇందులో విమాన టికెట్లు కేవలం రూ.1328 నుంచే మొదలవుతున్నాయి. అలాగే జీరో కన్వీనియెన్స్ ఫీ ఆఫర్ సైతం ఇస్తోంది. దేశీయ టూర్లలో ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక రెండోది ఎక్స్‌ప్రెస్ వాల్యూ. ఇందులో విమాన టికెట్ ధరలు రూ.1498 నుంచి మొదలవుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్ ద్వారా ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ జనవరి 9వ తేదీనే ఓ పోస్ట్ చేసింది. జనవరి 13వ తేదీలోపు టికెట్లు బుక్ చేసుకుని జనవరి 24 నుంచి సెప్టెంబర్ 30, 2025 వరకు ప్రయాణం చేయండీ అంటూ పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ చూడవచ్చు.