ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బాదం ఆరోగ్యానికి చాలా మంచిది, కానీ ఎలా తినాలంటే

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Jan 12, 2025, 11:32 PM

ఉదయాన్నే మనం తీసుకునే ఫుడ్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. అందుకే, హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. వీటి వల్ల రోజంతా ఎంతో యాక్టివ్‌గా ఉండడమే కాకుండా శరీరానికి పోషణ అందుతుంది. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల రోజు మొత్తానికి సరిపడా శక్తి అందుతుంది. వీటిని తింటే ఆరోగ్యపరంగా చాలా మేలు చేస్తుంది. పోషణతో పాటు శక్తి కూడా అందుతుంది. హెల్దీగా ఉండాలంటే కొన్ని హెల్దీ ఫుడ్స్ తీసుకోవాలి. అందులో డ్రైఫ్రూట్స్, నట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తింటే శరీరానికి చాలా మంచిది. బాదం ఆరోగ్యానికి మంచివి.. అయితే, వీటిని ఎండుద్రాక్షతో కలిపి తింటే మరీ మంచిది. అయితే, నిపుణుల ప్రకారం వీటిని సరైన విధానంలో తినాలి. అదెలానో తెలుసుకోండి.


ఎండుద్రాక్ష..


​ఎండుద్రాక్షలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. వీటిలో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా పాస్ఫరస్, జింక్, కాపర్, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్‌లు కూడా ఉన్నాయి. ఈ డ్రైఫ్రూట్స్‌లో విటమిన్ బి, సిలు ఎక్కువగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌తో పోలిస్తే ఇందులో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. నిజానికీ వయసు పెరిగేకొద్దీ కణాలు దెబ్బతినడం మొదలవుతుంది. దీంతో స్కిన్‌టోన్‌లో మార్పు రావడమే కాకుండా చర్మం వదులుగా మారుతుంది. అయితే, ఎండుద్రాక్ష తినడం వల్ల చాలా కాలం పాటు అందంగా, యవ్వనంగా ఉంటారు.


షుగర్ పేషెంట్లకు ఈ 5 నట్స్ బెస్ట్


బాదంపప్పుతో లాభాలు..


​బాదంలో కాల్షియం, ఐరన్, ఫైబర్, విటమిన్ ఇలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉంటారు. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు బాదంపప్పులో ఉన్నాయి. వీటిలో సోడియం ఉండదు. కాబట్టి, హైబీపి ఉన్న వారు కూడా తినొచ్చు. బాదంపప్పు తింటే షుగర్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.


పరగపడపున..


పరగడపున ఎండుద్రాక్ష, బాదంపప్పులు తింటే వాటిలోని పోషకాలు త్వరగా శరీరానికి అందుతాయి. జీర్ణవ్యవస్థ సరిగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా రోజంతా అలసటగా ఉండదు. ఎక్కువ పనిచేసినా బలహీనంగా ఉండరు. పీరియడ్స్ నొప్పులు కూడా తగ్గుతాయి. ఎముకలు బలపడతాయి. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది.


గుండె ఆరోగ్యానికి..


ఈ రెండింటి కాంబినేషన్ బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. బాదంలోని హెల్దీ ఫ్యాట్స్, ఎండుద్రాక్షలోని ఫైబర్‌ బాడీలోని కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.


బ్లడ్ షుగర్ కంట్రోల్..


బాదంలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల ఎండుద్రాక్షలోని చక్కెరని మెల్లిగా అబ్జార్బ్ అయ్యేలా చేస్తుంది. దీంతో ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పెరగవు.


జ్ఞాపకశక్తి..


ఎండుద్రాక్ష, బాదంపప్పులు ఉదయాన్నే పరగడపున బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే జ్ఞాపకశక్తి మెరుగై మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. చదువుకునే పిల్లల చేత వీటిని తినిపించడం చాలా మంచిది. దీని వల్ల వారు బ్రెయిన్ పదునుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.


ఎలా తినాలి..


ఇన్ని లాభాలున్న బాదం, ఎండుద్రాక్షలను సరైన విధంగానే తీసుకోవాలి. అప్పుడే పోషకాలు అందుతాయి. దీనికోసం, 3, 4 బాదంపప్పు, 10 నుంచి 15 ఎండు ద్రాక్షలను రాత్రంతా నానబెట్టి ఆపై ఉదయమే బాదం తొక్కతీసి ఎండుద్రాక్షలతో కలిపి తినండి. నానబెట్టిన నీరు కూడా పారబోయకుండా తీసుకుంటే మరీ మంచిది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com