తాడిపత్రి పట్టణంలోని బుగ్గరామలిగేశ్వరస్వామి, చింతల వెంకటరమణస్వామి, వేదమాతగాయత్రీ అమరలింగేశ్వరస్వామి ఆలయాలతో పాటు షిర్డీసాయిబాబా, పుట్టపర్తి సాయిబాబా, శివసాయిబాబా మందిరాలను రాష్ట్ర విజిలెన్స ఎనఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వెంకటరమణమూర్తి కుటుంబ సభ్యులతో ఆదివారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో అర్చకులు వారికి ఘన స్వాగతం పలికి స్వామివార్ల దర్శనం చేయించి ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపించారు. ఆలయాల విశిష్టతను వివరించారు. అనంతరం శాలువాకప్పి తీర్థప్రసాదాలను అందజేశారు.