బాలికలు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి సూచించారు. తాడిపత్రి పట్టణ సమీపంలోని సౌభాగ్యసింధు ట్రస్ట్ బాలకల్యాణ ఆశ్రమంలో ఆదివారం నియోజకవర్గ కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొని మాట్లాడారు. బాలికలు పట్టుదలతో సాధన చేస్తే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో బాలికలకు కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం కబడ్డీలో సాయుచైతన్య టీం విజయం సాధించింది. సరస్వతి విద్యామందిరం టీం రన్నర్‌గా నిలిచింది. ఈ టీంలకు బహుమతులను అందజేశారు.