భోగి పండుగ సందర్భంగా పెనుకొండ పట్టణంలోని మంత్రి సవిత స్వగృహం వద్ద టీడీపీ నాయకులతో కలిసి సవిత భోగి మంటలు వేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రజల జీవితాలలో వెలుగులు, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి పండుగ కు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.