అందంగా గురించి ప్రతి ఒక్కరూ ఆరాటపడతారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కొందరూ కాస్ట్లీ క్రీమ్స్, ఫేస్‌ప్యాక్స్ వాడతారు. వీటి వల్ల అంతగా రిజల్ట్ ఉండదు. అలా కాకుండా కొన్ని ఇంటి చిట్కాలతో కూడా ముఖం కాంతివంతంగా కనిపిస్తుంది. అలాంటి వాటిలో గంజినీరు కూడా ఒకటి. ఈ నీటిని వాడడం వల్ల ముఖం ప్రకాశవంతంగా, మృదువుగా కనిపిస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి. మరి ఆ నీటితో ఏం చేయొచ్చో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు
గంజినీరు
తేనె
నిమ్మరసం
ఈ స్క్రబ్‌తో.. మెరిసే అందం మీ సొంతం
గంజినీరు
గంజినీటిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇది బ్లీచింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇది విటమిన్ బితో సహా అనేక ప్రయోజనాలు కలిగి ఉంటాయి. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. దీనిని వాడడం వల్ల చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది.
తేనె
చర్మ సౌందర్యానికి తేనె బాగా హెల్ప్ చేస్తుంది. ఇది చర్మాన్ని ప్రకాశించేలా చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. తేనెలో శక్తివంతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది సహజంగా చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో పాటు చర్మాన్ని బ్యాలెన్స్ చేసి సెబమ్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తుంది.
నిమ్మరసం
నిమ్మరసంలో ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయి. ఇది చర్మానికి మంచి శక్తిని, మెరుపుని ఇస్తుంది. ఫేస్‌ప్యాక్, ఫేస్ మాస్క్‌గా మాత్రమే వాడాలి. జిడ్డు చర్మానికి నిమ్మరసం మంచిది. నిమ్మరసం చర్మానికి మేలు చేస్తుంది. కాబట్టి, దీనిని కూడా ముఖానికి రాయొచ్చు. అయితే, నేరుగా రాయొద్దు. ఎందులోనైనా కలిపి రాయాలి.
ఎలా తయారుచేసుకోవాలి
ఇది చాలా ఈజీ. గంజి నీటిని పులియబెట్టొచ్చు. దీనికోసం ముందురోజు గంజినీటిని తీసుకోవాలి. అందులో తేనె కలపండి. దానికి కాస్తా నిమ్మరసం కలపండి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసి అప్లై చేసి మసాజ్ చేయాలి. ఇది చర్మానికి చాలా మంచిది. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా చేస్తుంది. మచ్చల్ని తగ్గిస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏ రకమైన చర్మానికైనా వాడొచ్చు.