కొల్లేరు సరస్సు సరిహద్దుల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. గత ఏడాది డిసెంబర్లో విచారణ తరువాత చేపట్టిన కార్యాచరణను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది. గత ఏడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు సుమారు 5 వేల ఎకరాల్లో ఆక్రమణలు తొలగించినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అఫిడవిట్ని పరిశీలించిన సుప్రీంకోర్టు.. తదుపరి నివేదిక దాఖలు చేయాలని ఆదేశించి, విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.