ప్రకాశం జిల్లా సింగరాయకొండలో విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లిన ఆరుగురు గల్లంతయ్యారు. వెంటనే సమాచారం అందుకున్న మెరైన్ పోలీసులు.. స్థానిక మత్స్యకారుల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చేపట్టారు. ఇద్దరు బాలికలు, యువకుడి మృతదేహాలు లభ్యం కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతులు పొన్నలూరు మండలం శివన్నపాలెంకు చెందిన నోసిన జెస్సిక (15), నోసిన మాధవ (25), కందుకూరు మండలం కొల్లగుంట గ్రామానికి చెందిన యామిని (16)గా గుర్తించారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతోంది.