ఏప్రిల్ నెలలో శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్లు ఈ నెల 18న ఉదయం 10నుంచి 20వ తేదీ వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నట్టు టీటీడీ అధికారులు వెల్లడించారు. టికెట్లు పొందిన వారు 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12గంటల్లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. శ్రీవారి కల్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ వంటి సేవలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా బుకింగ్ 21న ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, శ్రీవారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకునేందుకు వేలసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బుధవారం 71,417మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.42 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.