గత కొంతకాలంగా టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కూడా హిట్‌మ్యాన్ తీవ్రంగా నిరాశపరిచాడు. చివరికి సిడ్నీ టెస్టులో తనకుతానుగా జట్టు నుంచి తప్పుకున్నాడు కూడా. ఈ పరిణామం నెట్టింట పెద్ద దుమారమే రేపింది. అయితే, ఇప్పుడు రోహిత్ మునుపటి ఫామ్‌ను అందుకునేందుకు తెగ కష్టపడుతున్నాడు. దీనికోసం గంటల తరబడి నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు. ఇక త్వరలోనే ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది. దీంతో హిట్‌మ్యాన్ హార్డ్ వర్క్‌ను మరింత పెంచాడు. ముంబయిలో రంజీ, లోకల్ ప్లేయర్లతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇందులో డిఫెన్స్‌తో పాటు కొన్ని భారీ షాట్లు ట్రై చేశాడు. తన బ్యాటింగ్ ప్రాక్టీస్ తాలూకు వీడియోను హిట్‌మ్యాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత కొన్ని నెలలుగా పేలవమైన ఫామ్‌తో ఇక్కట్లు పడుతున్న రోహిత్ స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత అభిమానులు కామెంట్ చేస్తున్నారు.