ఫిబ్రవరి 19 నుంచి జరబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు సభ్యుల వివరాలను వెల్లడించారు. అయితే విజయ్ హజారే ట్రోఫీలో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న కరుణ్ నాయర్‌కు నిరాశే మిగిలింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు అతడు 8 మ్యాచులు ఆడి 752 రన్స్ చేశాడు. దీంతో టీమిండియాలో చోటు పక్కా అని అందరూ అనుకోగా జట్టులో స్థానం మాత్రం లభించలేదు.