పోలీసులకు, న్యాయస్థానాలకు మధ్య అనుసంధానంగా వ్యవహరిస్తూ విధులను నిర్వహిస్తున్న కోర్టు కానిస్టేబుళ్ల విధులు చాలా కీలకమని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీసుస్టేషన్ల కోర్టు సిబ్బంది, కోర్టు లైజన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి తుది తీర్పు వరకు, ఈ మధ్య కాలంలో జరిగిన కేసులకు సంబంధించిన ప్రతీ అంశాన్ని పూర్తి వివరాలతో సీసీటీఎన్ఎస్ అప్లికే షన్లో అప్లోడ్ చేయాలని సూచించారు. అలాగే కోర్టు కేసుల విచారణ విధానం, వివిధ దశల్లో ఎదురవుతున్న సమస్యలు, సమన్లు, వారంట్ల అమలు, సాక్షులను కోర్టులో హాజరు పర చడం, కేసు అభియోగ పత్రాలు దాఖలు, ఇతరత్రా విధివిధానాలపై ఆయన సిబ్బందికి దిశాని ర్దేశం చేశారు. కోర్టులో కేసుకు సంబంధించి ప్రతీ రోజూ కేసు డైరీ రూపంలో జత చేయాలన్నా రు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సలహాలు, సూచనలు పాటిస్తూ శిక్షల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు. డీసీఆర్బీ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.