సాగరతీరంలో అరుదైన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వేల కిలోమీటర్ల నుంచి రాష్ట్ర తీరప్రాంతానికి గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు సముద్రతీరంలో ఎక్కడ చూ సినా చనిపోయిన దర్శనమిస్తున్నాయి. సముద్రంలో అరుదుగా లభించే జాతిగా పేరొందిన ఈ తాబేళ్లు విదేశాల నుంచి వేలాది కిలో మీటర్లు ఈదుకుంటూ వచ్చి తీరప్రాంతంలో గుడ్లు పెడతాయి. అలా వచ్చిన తాబేళ్లు చనిపోతుం డడం కలవరానికి గురిచేస్తోంది. తీరప్రాంతాలకు ఆనుకుని ఉన్న పరిశ్రమల నుంచి విడుదలవుతున్న రసాయన కాలుష్యం,వేటగాళ్ల వలలకు చిక్కుకోవడం, ఇంజన్ పంకాకు తాబేళ్లు తగిలి మృత్యువాత పడుతున్నట్టు అంచనా. దీనిపై ఇటీవల డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. తాబేళ్లను సంరక్షించాలని..మృతికి గల కారణాలు అధ్యయనం చేయాలని.. సంరక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు.ఈ మేరకు అటవీ అధికారులు కాకినాడ హోప్ ఐలాండ్ ప్రాంతంలో తాబేళ్ల సంరక్షణలో భాగంగా మార్చి వరకు చేపల వేట నిషేధించారు.