భారతీయ కార్ మార్కెట్‌లో ఎస్‌యూవీలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. చాలా మంది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే చిన్న ఎస్‌యూవీల కోసం చూస్తారు. ఆటోమేటిక్ ఎస్‌యూవీల కోసం చూస్తున్నవారికి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి.హ్యుందాయ్ ఎక్స్‌టర్ ఎస్‌యూవీని ఆటోమేటిక్ ఆప్షన్‌లో రూ. 8,30,400 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఎక్స్‌టర్‌లో ఉన్న 1.2-లీటర్, 4-సిలిండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ శక్తిని, 113.8 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 19.2 కిలో మీటర్లు. ఈ ఎస్‌యూవీ స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, యాంబియంట్ నేచర్ సౌండ్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లతో వస్తుంది. ఆటో డిమ్మింగ్ IRVM, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.
నిస్సాన్ మాగ్నైట్ ఆటోమేటిక్ వేరియంట్‌ను రూ. 6,59,900 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇచ్చిన 1.0L పెట్రోల్ ఇంజన్ 71 బీహెచ్‌పీ శక్తిని, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 19.7 కిలో మీటర్ల వరకు ఉంటుంది. నిస్సాన్ మాగ్నైట్ వైర్‌లెస్ ఛార్జింగ్, వాక్-అవే లాక్‌తో కూడిన 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, కూల్డ్ గ్లోవ్‌బాక్స్, స్టోరేజ్, క్లైమేట్ కంట్రోల్‌తో ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, 360 డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు, ఎమర్జెన్సీ స్టాప్ వంటి ఫీచర్లను వస్తాయి. ఈబీడీతో పాటు సిగ్నల్, ఈఎస్‌సీ, టీపీఎంఎస్, ఏబీఎస్ వంటి అన్ని భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
టాటా పంచ్‌ని ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో రూ.7,76,990 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఇందులో ఇచ్చిన 1.2-లీటర్, 3-సిలిండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ 87 బీహెచ్‌పీ శక్తిని, 115 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని మైలేజ్ 18.8 కిలోమీటర్లు. ఈ ఎస్‌యూవీ యూఎస్‌బీ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, వెనుక ఏసీ వెంట్‌లు, సెంటర్ కన్సోల్‌లో వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ అటోతో కూడిన కొత్త 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టాండర్డ్ డ్యూయల్-తో వస్తుంది. ఎయిర్‌బ్యాగ్‌లు సెంట్రల్ లాకింగ్, ABS టెక్నాలజీ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉంటాయి.