ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అత్యధికంగా 9.30 శాతం వడ్డీ .. 5 లక్షలు జమ చేస్తే 18 నెలల్లో ఎంతొస్తుంది

business |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2025, 11:07 PM

 ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటిగా ఉన్నటువంటి శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌లో వెల్లడించింది. ఇప్పుడు ఈ బ్యాంకు జనరల్ సిటిజెన్స్‌కు వారం నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 8.80 శాతం వరకు వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇదే సమయంలో సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు వడ్డీ దాదాపు 50 బేసిస్ పాయింట్ల మేర అధికంగా అందిస్తోంది. వీరికి డిపాజిట్లపై కనీసం 4 శాతం నుంచి గరిష్టంగా 9.30 శాతం వరకు వడ్డీ వస్తుండటం విశేషం. సవరించిన వడ్డీ రేట్లు 2025, జనవరి 22 నుంచే అమల్లోకి వచ్చినట్లు బ్యాంక్ స్పష్టం చేసింది. రూ. 3 కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై ఇది వర్తిస్తుంది.


వడ్డీ రేట్లు సవరించిన తర్వాత ఇప్పుడు ఈ బ్యాంకు అత్యధికంగా 12 నెలల ఒక రోజు నుంచి 18 నెలల లోపు డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 8.80 శాతం, సీనియర్ సిటిజెన్లకు 9.30 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు మనం 18 నెలల వ్యవధికి.. రూ. 5 లక్షలు డిపాజిట్ చేస్తే.. సాధారణ ప్రజలకు రూ. 62,561 వడ్డీ వస్తుంది. ఇదే సీనియర్ సిటిజెన్స్‌కు అయితే 9.30 శాతం లెక్కన రూ. 66,117 వడ్డీ అందుతుంది.


ఇప్పుడు 7-14 రోజుల వ్యవధి డిపాాజిట్లపై సాధారణ ప్రజలకు 3.50 శాతం, సీనియర్ సిటిజెన్స్‌కు 4 శాతం వడ్డీ వస్తోంది. 6-9 నెలల వ్యవధి డిపాజిట్లపై వరుసగా 6 శాతం, 6.50 శాతం వడ్డీ రేట్లు ఉన్నాయి. ప్రతి టెన్యూర్ డిపాజిట్‌పైనా సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజెన్లకు వడ్డీ 50 బేసిస్ పాయింట్ల మేర అధికంగా వస్తోంది. 18-21 నెలల వ్యవధి డిపాజిట్లపై చూస్తే వరుసగా 8.30 శాతం, 8.80 శాతం మేర వడ్డీ రేట్లు ఉన్నాయి.


24 నెలల ఒక రోజు నుంచి 36 నెలల వ్యవధి డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 7.50 శాతం, సీనియర్ సిటిజెన్లకు 8 శాతం మేర వడ్డీ వస్తుంది. 36 నెలల ఒక రోజు నుంచి 60 నెలలకు అయితే వరుసగా 6.50 శాతం, 7 శాతంగా వడ్డీ రేట్లు ఉన్నాయి. టాక్స్ సేవర్ అంటే 5 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు 6.50 శాతం, సీనియర్ సిటిజెన్లకు 7 శాతం వడ్డీ రేట్లు కొనసాగుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com