కడప జిల్లా, గుర్రంకొండ మండలంలో యువత చెడు అలవాట్లకు బానిసలుగా మారుతున్నారు. ఈ క్రమంలో గంజాయి, మద్యం మత్తులో నేరాలకు పాల్ప డతూ బంగారు భవిష్యతను నాశనం చేసుకొం టున్నారు. మహిళలు ఒంటరిగా కనబడగానే మెడలో ఉన్న బంగారు బొట్టు గొలుసును తెం చుకొని పరారవుతున్నారు. చైన్ స్నాచింగ్ చేయ డంతో ప్రావీణ్యం ఉన్న యువకులను బయట నుంచి పిలిపించి వారికి పట్టణంలో వివిధ వీధులను కలుపుతూ ఉన్న రోడ్లను గురించి అవగాహన కల్పిస్తున్నట్లు సమాచారం. మెయి న బజార్లను వదిలి సీసీ కెమెరాలు లేని వీధు ల్లో తిరిగే ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తూ చైన స్నాచింగ్‌తో పరారవుతున్నారు. చోరీ సమ యంలో ముఖానికి పూర్తి స్థాయిలో మాస్క్‌లు వేసుకోవడంతో గుర్తు చిక్కడం లేదని బాధి తులు వాపోతున్నారు. గుర్రంకొండ మండలం లో చైన స్నాచింగ్‌ల ముఠా సభ్యులు బస్టాప్ లు, జన సంచారం లేని వీధుల్లో తిరిగే మహిళ లపై రెక్కి నిర్వహిస్తూ చైన స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పట్ట ణంలోని తాళంవీధి, బజారు వీధి, కొత్తపేట, ఎగువఅమిలేపల్లె క్రాస్, తరిగొండ, మర్రిపాడు గ్రామాల్లో చైన స్నాచింగ్ ముఠా సభ్యులు ద్విచక్ర వాహనాల్లో వచ్చి మహిళల మెడలోని బంగారు గొలుసులను లాక్కెళ్లిన సంఘటనలు న్నాయి. ఇందుకు కొన్ని సంఘటనల్లోకి వెళితే.. బస్టాప్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న లక్ష్మీదే వి(55) అనే మహిళపై దాడి చేసి మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని దుండగు లు పట్టపగలే లాకెళ్లిన సంఘటన గత ఏడాది ఫిబ్రవరి 1న ఎగువఅమిలేపల్లె క్రాస్ వద్ద జరి గింది. ఈ ఘటనలో మహిళ దుండగులను ప్రతిఘటించిన ఆమెను తోసేసి 43 గ్రామలు బరువు గల బంగారు గొలుసును లాకెళ్లారు. వాటి విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితురాలు తెలిపింది. దీంతో బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని గుర్రంకొండ పోలీ సులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. మరో ఘటనలో గత ఏడాది ఏఫ్రిల్ 16వ తేదీన మం డలంలోని అమిలేపల్లె గ్రామానికి చెందిన బి.ఉత్తమ్మ(65) ఇంటి మొదటి అంతస్తులోని బాల్కానిలో నిద్రిస్తుండగా దుండగుడు బాధి తురాలి పక్కఇంటి వైపు నుంచి ఇంటిలోకి ప్రవే శించి మెడలో ఉన్న బంగారు గొలుసును కట్టర్ తో కత్తిరించి పారిపోయాడు. బాధితురాలి గట్టి గా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చేలోపు నిందితుడు పరార్యయాడు. దుండగుడు లాక్కె ళ్లిన బంగారు గొలుసు 30 గ్రాములు ఉంటుం దని ఇది రూ.2 లక్షలు చేస్తుందని బాధితురాలి తెలుపుతుంది. జరిగిన విషయాన్ని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కా గా 2023 సెప్టెంబరు16వ తేదీ గుర్రంకొండ కొత్తపేటలో డి.రాజమ్మ అనే మహిళ బజారుకు వచ్చి నిత్యవసరాలను కొనుగోలు చేసుకొని ఇం టికి వెళుతుండగా గుర్తు తెలియని దుండగుడు మెడలోని 20 గ్రాముల బంగారు బొట్టు గొలు సును లాకెళ్లాడు. బాధితురాలు గట్టిగా కేకేల వేయగా దొంగ పరారయ్యాడు.