కూటమి అధికారంలోకి రావడంతో వెంకట్రామన్నగూడెం ఉద్యాన విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం సంతరించుకుంది. రాష్ర్టీయ కృషి వికాస్ యోజన కింద ఒక్క ఏడాదిలోనే రూ.23 కోట్లు మంజూరు చేయనుంది. ఇంత పెద్ద మొత్తంలో ఒకేసారి నిధులు కేటాయించడం ఇదే తొలిసారి. వర్సిటీ నుంచి రూ.31 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు ప్రతిపాదనలు వెళ్లగా రూ.23 కోట్లు మంజూరుకు స్పష్టత లభించింది. దీనివల్ల పరిశోధన కేంద్రాలు బలోపేతం కానున్నాయి. రైతులకు సేవలందించే మౌలిక వసతులు అభివృద్ధి కానున్నాయి.ఉద్యాన విశ్వ విద్యాలయంలో రైతులకు ఉప యోగపడేలా కస్టమ్ హైరింగ్ కేంద్రాలను ఏర్పా టు చేయనున్నారు. కోకో, కొబ్బరి సాగుకు రెండు కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక చేశారు. రైతులకు సాగులో మెలకువలు, అధిక దిగుబడులు, తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం తెచ్చేలా కస్టమ్ హైరింగ్ సెంటర్లో అవగాహన కల్పి స్తారు.
అవసరమైతే అవే పరికరాలను రైతులకు అందజేస్తారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒకే ఏడాది రూ.23 కోట్లు మంజూరు చేయడానికి అంగీకరించింది. వీటిని రాష్ట్రవ్యాప్తంగా పరిశో ధన కేంద్రాల్లో వెచ్చిస్తారు. భూసార పరీక్షలు, జీవ రసాయన కీటక నాశినిల ఉత్పత్తి వంటి ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నారు. ఇప్పటికే ఉద్యాన వర్సిటీలో పరిశోధన కేంద్రంలో కొబ్బరిపై తెల్ల దోమకు సంబంధించిన జీవ రసాయన మందు ను తయారుచేశారు. రైతులకు అది ఎంతగానో ఉపయోగపడింది. ఉభయ గోదావరి జిల్లాలో కొబ్బరికి తెల్ల దోమ ఆశించి ఎంతగానో నష్టపెట్టింది. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉత్పత్తి చేసిన జీవ రసాయన మందు కొబ్బరిలో తెల్ల దోమ నివారణకు ఉపయోగపడింది. రైతులకు ఉపయోగపడే ఇటువంటి మందుల తయారీకి రాష్ర్టీయ కృషి వికాస యోజనలో ప్రభుత్వం కేటాయించే నిధులను ఉపయోగించనున్నారు. విశ్వ విద్యాలయం చేపట్టే ప్రాజెక్ట్‌లకు ప్రభుత్వా నికి నివేదిక సమర్పించారు. వాటిని ప్రభుత్వం ఆమోదించింది. నిఽధులు కేటాయింపు కోసం అనుమతులు మంజూరుచేసింది.