గత కొన్ని నెలల నుంచి సాగుతున్న ఢిల్లీ ఎన్నికల సమరం నేటితో ముగిసింది. ఢిల్లీ ఓటర్లు తమ నిర్ణయాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. 6 గంటలకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి కాగా.. 6.30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్ వివిధ సంస్థలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చాలా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తలకిందులు కాగా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలు ఏం చెబుతాయి అనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయా లేక తలకిందులు చేస్తాయా అనేది తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.
ఎగ్జిట్ పోల్ ఫలితాలు
సీఎన్ఎస్
బీజేపీ - 44 సీట్లు
ఆప్ - 26 సీట్లు
జేవీసీ పోల్
బీజేపీ - 39-45 సీట్లు
ఆప్ - 22-31 సీట్లు
కాంగ్రెస్ - 0-2 సీట్లు
ఇతరులు - 0-1 సీట్లు
పీపుల్స్ పల్స్
బీజేపీ - 51-60 సీట్లు
ఆప్ - 10-19 సీట్లు
కాంగ్రెస్ - 0
ఏబీపీ మ్యాట్రిజ్
బీజేపీ - 35-40 సీట్లు
ఆప్ - 32-37 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
రిపబ్లిక్ పీ మార్క్
బీజేపీ - 39-49 సీట్లు
ఆప్ - 21-31 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
ఢిల్లీ టైమ్స్ నౌ
బీజేపీ - 39-45 సీట్లు
ఆప్ - 22-31 సీట్లు
కాంగ్రెస్ -
ఆత్మసాక్షి
బీజేపీ - 38-41 సీట్లు
ఆప్ - 27-30 సీట్లు
కాంగ్రెస్ - 1-3 సీట్లు
చాణిక్య స్ట్రాటజీస్
బీజేపీ - 39-44 సీట్లు
ఆప్ - 25-28 సీట్లు
కాంగ్రెస్ -
కేకే సర్వే
బీజేపీ-22
ఆప్-39
కాంగ్రెస్-
పీపుల్స్ ఇన్సైట్
బీజేపీ - 40-44 సీట్లు
ఆప్ - 25-29 సీట్లు
కాంగ్రెస్ - 0-1 సీట్లు
![]() |
![]() |