అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో భాగమైన క్రికెటర్ గొంగడి త్రిషను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున కోటి రూపాయల నజరానా ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డిని బుధవారం రోజున ఆయన నివాసంలో క్రికెటర్ గొంగడి త్రిష కలిశారు. ఈ సందర్భంగా అండర్-19 ప్రపంచ కప్లో అద్భుతంగా రాణించిన త్రిషను అభినందించారు. త్రిషను శాలువాలతో సత్కరించారు. ఆమె భవిష్యత్ లో దేశం తరుపున మరింతగా రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. త్రిషకు కోటి రూపాయల నజరానా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, యశస్విని రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు.
ఇదిలాఉంటే, అండర్ 19 మహిళల టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాలో మెంబర్గా ఉన్న తెలంగాణకు చెందిన మరో క్రీడాకారిణి ధృతి కేసరికి కూడా సీఎం రేవంత్ రెడ్డి.. 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అంతేకాకుండా టీమ్ హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ షాలినికి పది లక్షల చొప్పున నజరానా ప్రకటించారు.