చిత్తూరు కార్పొరేషన్ పరిధిలోని అన్ని పాఠశాలలు, అంగన్వాడీలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 10వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్య క్రమాన్ని నిర్వహించాలని కమిషనర్ నరసింహ ప్రసాద్ శుక్రవారం ఆదేశించారు. పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం పోస్టర్లను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. అయన మాట్లాడుతూ పిల్లలు శారీరకంగా, మానసిక ఎదగాలంటే నులిపురుగులను నిర్మూలించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.