అంచనాలకు తగ్గట్లుగానే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తుందని మాజీ ఎంపీ జీవీఎల్ తెలిపారు. 41 సీట్లలో ఆధిక్యంలో బీజేపీ ఉందని అన్నారు. ఖచ్చితంగా 46 సీట్లకు తగ్గకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఇది చారిత్రాత్మక విజయమని తెలిపారు. ఆప్‌ను చిత్తుగా ఓడించడం గొప్ప ఆనందం ఇచ్చిందని తెలిపారు. గత ఎన్నికల తీర్పునకు భిన్నంగా డబుల్ ఇంజన్ సర్కార్‌కు ఢిల్లీ ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. మరోసారి మోదీ నాయకత్వానికి ఢిల్లీ ఓటర్లు జైకొట్టారని జీవీఎల్ తెలిపారు.ఆప్ వాగ్దానాలను ప్రజలు విశ్వసించలేదని అన్నారు.
అవినీతి పాలనకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. ఆప్ నేతలు అధికార దుర్వినియోగం చేశారని విమర్శించారు. సామాన్యుడిని అని చెప్పుకునే కేజ్రీవాల్ ఆడంబరాలకు పోయి శీష్ మహల్ కట్టుకున్నారని మండిపడ్డారు. పోటీ చేసిన స్థానంలో గెలుపుకోసం ఆరాటపడే స్థాయికి కేజ్రీవాల్ దిగజారిపోయారని విమర్శించారు. ఢిల్లీ ప్రజలు ఆప్‌కు చెంపపెట్టులాంటి తీర్పు ఇచ్చారని అన్నారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మాటిచ్చారు. మోదీ అంటేనే విశ్వాసం, ఇచ్చిన హామీలను అమలు చేస్తామని చెప్పారు. ప్రజలకు మేలు చేసేలా తమ పాలన కొనసాగుతుందని జీవీఎల్ పేర్కొన్నారు.
![]() |
![]() |