రోజూ కాఫీ తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులు, టైప్ –2 డయాబెటిస్, స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని నివారిస్తాయి. అలాగే సిర్రోసిస్, ఫ్యాటీ లివర్, అల్జీమర్స్ వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చురుకుదనం, శక్తిని మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే కెఫిన్ మెదడు సరిగా పని చేసేలా ప్రోత్సహిస్తుంది.