విద్యార్థులు ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కడప మహిళా పోలీ్‌సస్టేషన సర్కిల్ ఇనస్పెక్టరు ఈదురుబాషా అన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం నగరంలోని ప్రభుత్వ ఉర్దూ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రమశిక్షణతో అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. విద్యార్ధి దశ నుంచే సమాజం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. బాగా చదువుకుని సమాజానికి, దేశానికి సేవ చేయాలని కోరారు. అవగాహన కార్యక్రమంలో పోక్సో యాక్టు, పిల్లల భద్రత, బాల్యవివాహాలు, ఈవ్‌టీజింగ్, డయల్ 100, రహదారి భద్రత, సోషల్ మీడియా, సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను మహిళాపీఎస్ సీఐ తెలిపారు. కార్యక్రమంలో యాంటి హ్యుమన ట్రాఫికింగ్ ఎస్‌ఐ శాంతమ్మ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ జి.మహేశ, సోషల్ వర్కర్ లక్ష్మీప్రసన్న తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |