గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పేర్ని నాని ఇంటి వద్దకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఏఆర్ ఏఎస్పీ, డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో నానిని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో, పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు.
![]() |
![]() |